Header Banner

పవన్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి! కొద్ది రోజులు చికిత్స కొనసాగుతూనే..!

  Wed Apr 09, 2025 19:35        Others

సింగపూర్‌లోని స్కూల్‌లో మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. ప్రమాదంలో అతడి చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చొచ్చుకుపోవడంతో ఐసీయూలో అత్యవసర చికిత్స అందించారు. పరిస్థితి కొంత మెరుగవటంతో బుధవారం అతడిని సాధారణ గదికి మార్చారు. వైద్యుల పర్యవేక్షణలో మరికొద్ది రోజులు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆసుపత్రిలో ఉన్న మార్క్ శంకర్ ఫొటో ఒకటి విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

ఈ సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ తన పెద్ద సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి సింగపూర్ వెళ్లారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పవన్‌కు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, అలాగే సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను మార్క్ ఆరోగ్యంపై పర్యవేక్షణ చేపట్టాలంటూ ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి మార్క్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి హైకోర్టులో షాక్.. ఇక అరెస్టేనా?

 

జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం - క్షమాపణ చెప్పాలని డిమాండ్! పోలీసు సంఘం స్ట్రాంగ్ కౌంటర్!

 

రెండు తెలుగు రాష్ట్రాల‌కు పండగ లాంటి వార్త! గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌!

 

ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. అమరావతిలో ఇ-13, ఇ-15 కీలక రహదారుల విస్తరణ! అక్కడో ఫ్లైఓవర్ - ఆ ప్రాంతం వారికి పండగే!

 

వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh ##MarkShankarPawanovich #PawanKalyanSon #HealthUpdate #PrayersForMark #SingaporeHospital #SchoolFireAccident #GetWellSoonMark #PawanKalyan